Revanth Reddy: కేసీఆర్.. నయా భూస్వాములను తయారు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భూ బాధితులు తమ సమస్యలను నేతల ముందు ఏకరవు పెట్టారు. పేదల ఆత్మగౌరవంపై కేసీఆర్ సర్కారు దాడి చేస్తుందన్నారు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన వారికి సంకెళ్లు వేసి నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను రద్దు చేయడమే మార్గమన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల జోలికి రావొద్దని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అసెంబ్లీలో, బయట ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. భూముల విలువ పెంపకం పేరుతో రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
-
World News
Bangla Fuel Crisis: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. ఒకేసారి 52శాతం పెరుగుదల
-
India News
Anand Mahindra: మీతో పాటు దేశం మొత్తం డ్యాన్స్ చేస్తోంది..!
-
Sports News
Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
-
Movies News
Janhvi Kapoor: నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్
-
General News
Telangana News: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- iPhone 14: యాపిల్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఐఫోన్ 14 రాక ఆలస్యం?
- CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!