Maharashtra: మహారాష్ట్ర భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: కాంగ్రెస్‌

మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీని భారతీయ జనతా పార్టీ కించపరిచిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా  తక్షణమే రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పోటోలే డిమాండ్‌ చేశారు.

Updated : 02 Dec 2022 01:01 IST

ముంబయి: మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీని భారతీయ జనతా పార్టీ కించపరిచిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా  తక్షణమే రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్‌ చేశారు. ‘‘ శివాజీని కించపరుస్తూ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, భాజపా అధికార ప్రతిని సుధాన్షు త్రివేది వ్యాఖ్యలు చేశారు. తాజాగా  భాజపాకి చెందిన మరో మంత్రి కూడా శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడారు. శివాజీ నుంచి స్ఫూర్తి పొందిన భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ యోధుడిపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలి’’ అని పటోలే డిమాండ్‌ చేశారు. శివాజీని విమర్శించే భాజపా నాయకులకు ప్రభుత్వంలో కొనసాగే హక్కులేదని  అన్నారు. ఒకవైపు శివాజీని పొగుడుతూ.. మరోవైపు ఆయనను విమర్శించేవారికి ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదన్నారు.

ఇక అకాల వర్షాల కారణంగా పంట కోల్పోయిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని పటోలే విమర్శించారు. ఇన్సూరెన్స్‌ సంస్థలకు రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా పరిహారం రావడం లేదన్నారు. రైతులకు ఎందుకు పరిహారం చెల్లించడంలేదో ఇన్సూరెన్స్‌ కంపెనీలు సమాధానం చెప్పాలన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని