టీవీ చర్చాకార్యక్రమాలకు కాంగ్రెస్ దూరం
నేడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీవీ చర్చా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులెవరూ టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆదేశించారు......
దిల్లీ: నేడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీవీ చర్చా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులెవరూ టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆదేశించారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
‘‘దేశవ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ తరుణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బదులు.. ఎన్నికల ఫలితాలపై చర్చలు జరపడం సమంజసం కాదని భావిస్తున్నాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధులెవరూ టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నిర్ణయించాం. అయితే, మీడియా అడిగే ప్రశ్నలపై మాత్రం స్పందించవచ్చు. మేం గెలవొచ్చు.. ఓడిపోనూ వచ్చు. కానీ, ఆక్సిజన్, బెడ్లు, ఔషధాలు, వెంటిలేటర్లు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రణ్‌దీప్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
నేడు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అసోం, కేరళ, పుదుచ్చేరిలో కూటమి పక్షాలతో కలిసి కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)