Congress: భాజపా ర్యాలీలకు వెళ్లి.. ప్రియాంక వద్దకు వచ్చారు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవాలని ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో యూపీ వాతావరణంలో మార్పు కనిపిస్తుందంటూ కాంగ్రెస్‌ ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇలాంటివి రాజకీయాల్లో అరుదంటూ రాసుకొచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..

Published : 23 Feb 2022 01:29 IST

ఇలాంటివి రాజకీయాల్లో అరుదు: కాంగ్రెస్

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవాలని ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో యూపీ వాతావరణంలో మార్పు కనిపిస్తుందంటూ కాంగ్రెస్‌ ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇలాంటివి రాజకీయాల్లో అరుదంటూ రాసుకొచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కారులో ప్రయాణిస్తుండగా.. కాషాయ తలపాగా చుట్టుకున్న కొందరు ఆమెను సమీపించారు. వారంతా భాజపా ర్యాలీ నుంచి వచ్చినవారని కాంగ్రెస్ వెల్లడించింది. ‘భాజపా ర్యాలీలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రియాంక వద్దకు వచ్చారు. ఆమెను అడిగి ప్రచార సామాగ్రిని తీసుకున్నారు. అలాగే ఆమెతో కలిసి సెల్ఫీలు దిగారు. యూపీలో నెలకొన్న వాతావరణాన్ని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఇలాంటివి రాజకీయాల్లో అరుదు’ అంటూ ట్వీట్ చేసింది. ఆ వీడియోలో సదరు వ్యక్తులు ప్రియాంకను అడిగి ప్రచార సామాగ్రిని తీసుకోవడం కనిపిస్తోంది. 

ఇదిలా ఉండగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతను ప్రియాంక తీసుకున్నారు. ‘మహిళలు పోరాడగలరు’ అంటూ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఆమె విస్తృతం ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు ముగియగా.. ఇంకా నాలుగు విడతల పోలింగ్ మిగిలి ఉంది. మరోపక్క ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలో నిలిచింది. ఓ సమయంలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రియాంక హింట్ ఇచ్చి, చర్చకు తెరతీశారు. ఏదేమైనా.. మార్చి 10న అసలు వాతావరణం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని