Published : 28 Jan 2022 01:52 IST

Punjab Election 2022: పంజాబ్‌ సీఎం అభ్యర్థిపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

చండీగఢ్‌: పంజాబ్‌ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ.. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.

‘‘సాధారణంగా ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించం. కానీ, పార్టీ కార్యకర్తలు కోరుకుంటే ఎంపిక చేస్తాం. వారి డిమాండ్‌ను త్వరలోనే నెరవేరుస్తామ’’ అని  రాహుల్ అన్నారు. కార్యకర్తలతో సంప్రదింపులు జరిపే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిత్వం విషయంలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్‌ సిద్ధూ మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాహుల్‌ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాహుల్‌ ప్రకటన సమయంలో చన్నీ, సిద్ధూ అదే వేదికపై ఉన్నారు.

‘‘ఇద్దరు వ్యక్తులు రాష్ట్రానికి నాయకత్వం వహించలేరు. ఒక్కరికే ఆ బాధ్యతలు దక్కుతాయి. అయితే, ఒకరికి అవకాశం ఇస్తే.. మరొకరు అన్నివిధాలా సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరి హృదయాల్లోనూ కాంగ్రెస్ ఆలోచనలు ఉన్నాయి’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. అంతకుముందు చన్నీ, సిద్ధూ మాట్లాడుతూ.. తాము సీఎం పదవిపై ఆశపడటం లేదని ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ పేర్కొన్నారు. ‘నేనూ ఏ పదవి కోసం పాకులాడటం లేదు. సీఎం అభ్యర్థిగా ఎవరి పేరైనా నిర్ణయించండి. వారి కోసం ప్రచారం చేసే మొదటి వ్యక్తి నేనే’ అని చన్నీ చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని