గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.

Updated : 08 Apr 2022 17:15 IST

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న సమయంలో కొంత మంది మహిళా కాంగ్రెస్‌ నేతలు గాయపడ్డారు. ఈ అంశంపై ఇవాళ గాంధీ భవన్‌లో సమావేశమైన మహిళా కాంగ్రెస్ కార్యవర్గం.. డీజీపీకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డీజీపీని కలిసేందుకు గాంధీ భవన్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు.. నారాయణగూడ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునితా రావు ఫిట్స్‌ రావడంతో కిందపడిపోయారు. ఆమెను పోలీసులు హుటాహుటిన కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని