Meghalaya: మోదీ సమక్షంలో.. మరోసారి సీఎంగా సంగ్మా ప్రమాణం
మేఘాలయ (Meghalaya) ముఖ్యమంత్రిగా మరోసారి కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ సమక్షంలో మంగళవారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధినేత కాన్రాడ్ కె. సంగ్మా (Conrad K Sangma) వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహన్.. సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎన్‌పీపీ (NPP) పార్టీకి చెందిన ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, భాజపా (BJP) నుంచి ఒకరు, హెచ్‌ఎస్‌పీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
ఇటీవల జరిగిన మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఎన్‌పీపీ 26 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లభించలేదు. దీంతో భాజపా (BJP), యూడీపీ వంటి మిత్రపక్షాలతో కలిసి కాన్రాడ్ సంగ్మా (Conrad K Sangma) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అటు నాగాలాండ్ (Nagaland), త్రిపుర (Tripura)లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రధాని మోదీ, పలువురు భాజపా నాయకులు హాజరుకానున్నారు. ఇక త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్ సాహా ఎంపికయ్యారు. బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులే మరోసారి పాలనాపగ్గాలు అందుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!