TS News: ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై కేసు కొట్టివేత

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  2017లో మహబూబాబాద్‌లో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అప్పటి

Updated : 09 Aug 2022 12:34 IST

హైదరాబాద్‌: మహబూబాబాద్‌ తెరాస ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  2017లో మహబూబాబాద్‌లో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అప్పటి కలెక్టర్‌ ప్రీతిమీనాతో శంకర్‌ నాయక్‌ అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై అభియోగాలు రుజువు కానందున ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు వీగిపోయింది.

మరోవైపు, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఉన్న రెండు కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ రెండు కేసులు నమోదయ్యాయి. పెబ్బేరు, వనపర్తిలలో నమోదైన ఈ కేసుల్ని కోర్టు కొట్టివేసింది.  అలాగే, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై నమోదైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘించారనర్న కేసును కూడా న్యాయస్థానం కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని