
TS News: సీఎల్పీనేత భట్టి విక్రమార్కకు కొవిడ్ పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు.. నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.