CPI: గవర్నర్‌ వ్యవస్థ రద్దు చేసే వరకు పోరాటం: కూనంనేని

సీపీఐ ఛలో రాజ్‌భవన్‌ పిలుపుతో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛలో రాజ్‌భవన్ కార్యక్రమానికి సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Published : 07 Dec 2022 13:28 IST

హైదరాబాద్‌: సీపీఐ ఛలో రాజ్‌భవన్‌ పిలుపుతో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛలో రాజ్‌భవన్ కార్యక్రమానికి సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, బాల మల్లేష్‌లతోపాటు పార్టీకి చెందిన ఇతర నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట కేంద్రం గవర్నర్లతో పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. భాజపా కార్యకర్తలా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని కూనంనేని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని