Munugode ByPoll: మునుగోడులో తెరాసకే సీపీఐ మద్దతు: చాడ వెంకట్‌ రెడ్డి

స్వార్థం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

Updated : 20 Aug 2022 20:19 IST

హైదరాబాద్: స్వార్థం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీపీఐ నేతలు నారాయణ మరికొందరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడులో ఐదు సార్లు సొంతంగా గెలిచాం. రెండు సార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచాం. భాజపాను ఓడించే పార్టీకే మా మద్దతు ఉంటుంది. భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. మునుగోడులో తెరాసకు మద్దతు ఇస్తున్నాం. మునుగోడు సభకు సీపీఐ నేతలు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. మునుగోడే కాదు అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తాం’’

‘‘తెరాసకు మద్దతు ఇచ్చినంతా మాత్రాన ప్రజల సమస్యలపై మా పోరాటం ఆగదు. రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.. రక్షించేందుకే కమ్యూనిస్టులు అప్రమత్తమయ్యారు. ప్రగతిశీల శక్తుల ముందు నిలవలేమని రేపు అమిత్ షాకు అర్థమవుతుంది. మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నాం’’ అని చాడ వెంకట్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని