Munugode Bypoll : సీపీఐ నేతలతో చర్చలు.. తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఐ నేతల చర్చలు జరిపారు. నిన్న రాత్రి రెండు గంటల పాటు

Published : 20 Aug 2022 09:36 IST

హైదరాబాద్‌ :  ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఐ నేతల చర్చలు జరిపారు. నిన్న రాత్రి రెండు గంటల పాటు సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా..  తెరాసకు మద్దతు ఇస్తామని సీపీఐ నేతలు హామీ ఇచ్చారు.

సీఎంతో చర్చించిన అంశాలపై కార్యదర్శి వర్గంతో సీపీఐ నేతలు ఇవాళ ఉదయం 10:30 గంటలకు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు మీడియా సమావేశంలో సీపీఐ నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు మునుగోడు సభకు రావాలని సీపీఐ నేతలను సీఎం కోరగా.. సభలో పాల్గొనేందుకు సీపీఐ అంగీకరించింది. తెరాస మునుగోడు సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts