వైకాపా నిర్వాకంతో సినిమాలూ భయంభయంగా చూడాల్సి వస్తోంది: సీపీఐ నారాయణ

ఏపీలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

Updated : 26 Feb 2022 15:32 IST

అనంతపురం: ఏపీలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో సినిమాలు కూడా భయంభయంగా చూడాల్సి వస్తోందని నారాయణ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయింది. ఆ హత్యకు వైఎస్‌ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలి. సీబీఐపైనే ఎదురుదాడి చేసే వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. సాంస్కృతిక రంగంలో వివాదానికి జగన్‌ వైఖరే కారణం. చిరంజీవి స్వార్థం కోసమే సీఎంను కలిసి సినిమా రాయితీలు మాట్లాడుకున్నారు’’ అని నారాయణ ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు