CPI Narayana: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను అర్ధాంతరంగా ఎందుకు మార్చారు?: నారాయణ

అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనపై

Published : 17 Jun 2022 13:45 IST

హైదరాబాద్‌: అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనపై ఆయన స్పందించారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. దాని ఫలితమే ఈ హింసాకాండ అని ఆరోపించారు. సైనిక రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని అర్ధాంతరంగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు.

15 నెలల్లోనే 10లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనలోనే దగా ఉందని నారాయణ ఆరోపించారు. నిరుద్యోగులను మాయ చేసే దుర్మార్గపు ఆలోచనల నేపథ్యంలోనే అగ్నిపథ్‌ను తీసుకొస్తున్నారని ఆక్షేపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి పాత పద్ధతినే కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని