Andhra News: మోదీతో భేటీ తర్వాత పవన్‌ మిన్నకుండిపోయారు: సీపీఐ నారాయణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మిన్నకుండిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజయవాడలో అన్నారు 

Updated : 23 Nov 2022 17:37 IST

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మిన్నకుండిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజయవాడలో అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పొత్తులపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్‌ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా, వైకాపా కలిసే పనిచేస్తున్నాయని.. భాజపా, వైకాపా అరాచకాలను అరికట్టాలంటే అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి వెళ్లాలని సూచించారు. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని