CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలు.. సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం

తిరుపతిలో ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Updated : 20 Jul 2022 15:34 IST

విజయవాడ: తిరుపతిలో ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ.. మరికొంత మందికి ఆవేశం కలిగింది. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి అభిమానులు, జన సైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో నారాయణ స్పందిస్తూ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని