TS News: ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ కూటమి: ఏచూరి

భాజపాను వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు...

Published : 10 Jan 2022 01:46 IST

హైదరాబాద్‌: భాజపాను వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సీపీఎం జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో మాట్లాడిన ఏచూరి .. భాజపాపై పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఎన్నికల సమయానికి పరిస్థితులకు అనుగుణంగా తగిన రాజకీయ వ్యూహం అనుసరిస్తామని పేర్కొన్నారు.  ప్రత్యామ్నాయ కూటమి ఎప్పుడైనా ఎన్నికల తర్వాతే ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం భాజపాపై వ్యతిరేకత పెరిగిందన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని, ఉపాధి కల్పన లేదని ఆరోపించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో తమ మద్దతు సమాజ్‌వాది పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్‌లో పరిణామాలు ఆ రాష్ట్రానికే పరిమితమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని