Updated : 09 Sep 2021 06:16 IST

Agartala: సీపీఎం కార్యాలయాలకు నిప్పంటించిన దుండగులు.. భాజపా పనేనంటోన్న లెఫ్ట్‌!

సీపీఎం ఆరోపణల్ని తిప్పికొట్టిన భాజపా

అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో దుండగులు బీభత్సం సృష్టించారు. రాజధాని నగరం అగర్తలాలోని సీపీఎం ప్రధాన కార్యాలయంతో పాటు మరో జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి నిప్పంటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. అగర్తలాలోని సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌తోపాటు దశరథ్‌ భవన్‌కు కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అక్కడున్న వాహనాలకు ధ్వంసం చేసి వాటికి కూడా నిప్పంటించారు. బిశాల్‌బార్గ్‌, కతాలియా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇటీవల సీపీఎంతో తలెత్తిన ఘర్షణలకు నిరసనగా భాజపా చేపట్టిన ప్రదర్శన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

త్రిపురలోని తమ కార్యాలయాలపై దుండగులు దాడికి సంబంధించిన పలు వీడియోలను సీపీఎం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇది భాజపా మూకల పనేనని ఆరోపించింది.  ‘భాజపా గూండాలు అగర్తలాలోని రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ప్రజా సంక్షేమం కోసం గళమెత్తుతున్న సీపీఎంపై భాజపా దాడులకు పాల్పడుతోంది’ అని ట్విటర్‌లో పేర్కొంది. ఈ వీడియోలో అనేకమంది యువకులు కర్రలు, రాళ్లు పట్టుకొని సీపీఎం కార్యాలయం వద్దకు చేరుకోవడం.. రాళ్లు రువ్వడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. పలువురి వద్ద కాషాయ జెండాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. సీపీఎం ఆరోపణలపై భాజపా స్పందించింది. సీపీఎం కార్యాలయంలో బాంబులు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించింది.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని