Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో మా మద్దతు తెరాసకే: తమ్మినేని వీరభద్రం

మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి

Updated : 01 Sep 2022 14:41 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మునుగోడు నియోజకవర్గానికి తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌కి ఎందుకు రాజీనామా చేశారని తమ్మినేని వీరభద్రం నిలదీశారు. మునుగోడులో భాజపాను గెలిపిస్తే నెలరోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పారని..  పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీతో బెదిరింపులకు భాజపా పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆక్షేపించారు.

రాబోయే ఎన్నికలు తెరాస వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారే అవకాశముందన్నారు. కాంగ్రెస్‌ స్థానంలో ఉండేందుకు భాజపా ప్రణాళికలు వేస్తోందన్నారు. సీపీఐలా తాము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని.. మునుగోడు ఉప ఎన్నిక వరకే తెరాసకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్‌ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని