అది భరతమాత గుండెలో కత్తి దింపడమే..!

కొవిడ్‌ కట్టడిలో భాగంగా కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చూస్తే భరతమాత గుండెలో కత్తి దింపినట్లుగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. 

Updated : 01 Jun 2021 05:06 IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై రాహుల్‌ విమర్శలు

దిల్లీ: కొవిడ్‌ కట్టడిలో భాగంగా కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చూస్తే భరతమాత గుండెలో కత్తి దింపినట్లుగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ట్విటర్‌ వేదికగా సోమవారం ఆయన పలు ఆరోపణలు చేశారు. దేశంలో ఈ ఏడాది మే నెలలో నిరుద్యోగిత శాతం రెండంకెలుగా నమోదైనట్లు మీడియా నివేదికలను చూపుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. దురహంకారపూరితమైన ఓ వ్యక్తి.. రూపాంతరం చెందుతున్న వైరస్‌.. కారణంగానే దేశంలో 97 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారని వేరొక ట్వీట్‌లో రాశారు. అయితే మోదీ వ్యతిరేక ప్రచారంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై  కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందంటూ భాజపా ఆరోపించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు టీకా ఉత్పత్తి సంస్థల నుంచి తమ కోటా వ్యాక్సిన్లను సైతం తీసుకోలేకపోతున్నాయని విమర్శించింది. ఆ రాష్ట్రాలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని