BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.
విజయవాడ: రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ ఫొటో ఎగ్జిబిషన్‌ను పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మద్యం ద్వారా వైకాపా నాయకులు జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. నరసాపురంలో గురువారం మద్యం దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు నగదు లావాదేవీల్లో అక్రమాలు వెలుగు చూశాయన్నారు. మధ్యాహ్నం సమయానికి రూ.లక్షల వరకు విక్రయాలు జరిగితే అందులో డిజిటల్ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనన్న విషయం బయటపడిందన్నారు. ప్రతి రోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా వైకాపా నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజల జేబుల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థనీయం కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్‌లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ