Danam nagender: త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది భారాస ఎమ్మెల్యేలు

త్వరలోనే కాంగ్రెస్‌లో 20 మంది భారాస ఎమ్మెల్యేలు చేరతారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు.

Published : 22 Jun 2024 04:41 IST

కేసీఆర్‌ విధానాలే ఆ పార్టీని ముంచాయి
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: త్వరలోనే కాంగ్రెస్‌లో 20 మంది భారాస ఎమ్మెల్యేలు చేరతారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విధానాలే ఆ పార్టీని ముంచాయని విమర్శించారు. చాలామంది భారాస ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారాస మొత్తం ఖాళీ అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌ల చేరిక త్వరలోనే ఉంటుందన్నారు. మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించినట్లు నాగేందర్‌ తెలిపారు. భారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప భారాస ఖాళీ అవుతుందన్నారు. అయితే హరీశ్‌రావుతో సహా కొందరు ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని