Dasoju Sravan: డ్రగ్స్‌కు ఖైరతాబాద్‌ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్‌

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తెరాస ప్రజాప్రతినిధులు నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఐపీఎస్‌

Updated : 01 Jul 2022 15:35 IST

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తెరాస ప్రజాప్రతినిధులు నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఐపీఎస్‌ అధికారులు కూడా డూడూ బసవన్న తరహాలో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులకు సలాం కొడుతున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజ్‌ శ్రవణ్‌ మాట్లాడారు. 

మెరిట్‌ ఆధారంగా రాష్ట్రంలో పోలీసుల బదిలీలు జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే, మంత్రుల లెటర్లు ఉంటేనే ట్రాన్స్‌ఫర్లు అవుతున్నాయన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ₹50 కోట్ల విలువైన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్న సీఐపై బదిలీ వేటు వేశారన్నారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ పబ్‌ నిర్వాకంపై గతంలో ఓ పోలీసు అధికారి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆయన్ను బదిలీ చేశారని శ్రవణ్‌ ఆరోపించారు. డ్రగ్స్‌కు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌ అడ్డాగా మారిందని, దీనిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని