Andhra news: ‘ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం’: బొత్స సత్యనారాయణ

ముమ్మాటికీ వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని.. ప్రతిపక్షాల అభిప్రాయాలు ప్రమాణికం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో

Updated : 05 Mar 2022 16:16 IST

విజయనగరం: ముమ్మాటికీ వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని.. ప్రతిపక్షాల అభిప్రాయాలు ప్రామాణికం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ కూడా వికేంద్రీకరణే సూచించిందని పేర్కొన్నారు. స్వార్థం కోసం పోలవరాన్ని, ప్రత్యేక హోదాను తెదేపా తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. జిల్లాల పునర్విభజనపై వచ్చిన విజ్ఞప్తులను కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిందేనని పునరుద్ఘాటించారు. వికేంద్రీకరణ కోసం ఏం చేయాలో అది చేస్తామని బొత్స స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని