Congress: దిల్లీలో కాంగ్రెస్‌కు మరో షాక్.. పెరిగిన ఆప్ బలం!
ఇటీవల జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నిక(MCD Polls)ల్లో చతికిలపడిన కాంగ్రెస్(Congress)కు మరో షాక్ తగిలింది. మొత్తం 250 స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించగా.. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
దిల్లీ: ఇటీవల జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నిక(MCD Polls)ల్లో చతికిలపడిన కాంగ్రెస్(Congress)కు మరో షాక్ తగిలింది. మొత్తం 250 స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించగా.. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. దిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహ్దీతో పాటు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు సబిలా బేగం, నజియా ఖాతూన్ శుక్రవారం ఆప్ నేత, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో సీఎం కేజ్రీవాల్ చేస్తోన్న అభివృద్ధి పనులు చూసే వీరంతా తమ పార్టీలో చేరారని ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ మీడియాకు తెలిపారు. మెరుగైన దిల్లీ కోసం పనిచేసేందుకు కలిసి రావాలని భాజపా, కాంగ్రెస్‌లకు పిలుపునివ్వగా.. దిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఇద్దరు కౌన్సిలర్లు ఆప్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అయితే, కేజ్రీవాల్ చేస్తోన్న అభివృద్ధిని చూసే తాము ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహ్దీ తెలిపారు. కేజ్రీవాల్ సారథ్యంలో దిల్లీ అభివృద్ధి కోసం ఆప్ శ్రమిస్తోందన్నారు. తన ప్రాంతంలో అభివృద్ధి కోసమే ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. డిసెంబర్ 4న జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలుచుకొని 15ఏళ్లుగా కొనసాగుతోన్న భాజపా ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టింది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 9, స్వతంత్రులు మూడు వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు కౌన్సిలర్లు ఆప్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 136కి చేరగా.. కాంగ్రెస్ బలం 7కి పడిపోయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
-
Movies News
Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్