Meenakshi lekhi: అలాంటి ‘పార్ట్ టైం సీఎం’ దిల్లీకి అవసరం లేదు: కేంద్రమంత్రి విమర్శలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి(Meenakshi Lekhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
దిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి(Meenakshi Lekhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్లీలో సమస్యలు పట్టించుకోకుండా ‘రాజకీయ పర్యాటకం’లో బిజీగా గడుపుతున్నారని.. అలాంటి పార్ట్ టైం సీఎం దిల్లీ ప్రజలకు అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. బుధవారం ఆమె దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన గణాంకాలను ఉటంకిస్తూ.. పర్యాటక సెస్ కింద గత ఏడేళ్లుగా రూ.1286 కోట్లు వసూలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కేవలం రూ.272 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాల కల్పనకు గానీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి నిధులు ఖర్చు చేయలేదని ఆరోపించారు.
‘‘కేజ్రీవాల్ ఏమీ చేయడంలేదు. ఎన్నికల రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ రాజకీయ పర్యాటకంలో తన సమయాన్ని గడుపుతోన్న ఇలాంటి పార్ట్ టైం ముఖ్యమంత్రి దిల్లీకి అవసరం లేదు. కేజ్రీవాల్ ప్రభుత్వం నిష్క్రియత్వం, బాధ్యతల నుంచి పారిపోతుండటంతో దిల్లీలో పెద్ద సంఖ్యలో వృద్ధులు, చిన్నారులు వాయు కాలుష్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు’’ అని ఆరోపించారు. దేశ రాజధాని నగరంలో 10 స్మాగ్ టవర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ రూ22 కోట్లతో కేవలం ఒక్కటి మాత్రమే నిర్మించారన్నారు. దీని నిర్వహణకు ప్రతి నెలా రూ.80లక్షలు ఖర్చు చేస్తున్నా అది కూడా సరిగా పనిచేయడంలేదన్నారు. స్మాగ్ టవర్ నిర్వహణకు అంత భారీగా వ్యయం చేస్తున్నా అది ఎందుకు పనిచేయడంలేదనే అంశంపై దర్యాప్తు జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను మీనాక్షి కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ