MLC Kavitha: దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోలీసుల ఆంక్షలు
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.
దిల్లీ: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షకు భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే రోజు భాజపా ధర్నా కూడా ఉన్నందున, అనుమతిచ్చిన ప్రదేశంలో సగం ప్రాంతంలోనే ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు చెప్పారని కవిత తెలిపారు.
జంతర్‌మంతర్ వద్ద దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ... ఉన్నట్టుండి భాజపా ధర్నా ఏంటని ప్రశ్నించారు. భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో సుమారు 5వేల మందితో దీక్ష చేస్తామని ముందుగానే దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చామని, అందుకు అంగీకరించారని స్పష్టం చేశారు. దీక్షకు ఒక రోజు ముందు సగం ప్రాంతంలోనే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పడం భావ్యం కాదన్నారు. దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని, దీక్షకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Millet man: ‘తెలంగాణ మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ ఇక లేరు
-
World News
Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’
-
Politics News
Sajjala: ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోంది: సజ్జల
-
Politics News
Akhilesh Yadav: కాంగ్రెస్ పనైపోయింది.. భాజపా పరిస్థితి అదే..!
-
Sports News
IND vs AUS: అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది: రోహిత్ శర్మ