Pawan Kalyan: 19న బాధ్యతలు స్వీకరించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 16 Jun 2024 22:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయనకు శాఖలు కేటాయించారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా  శాఖలు ఉన్నాయని పవన్ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నట్టు పవన్ కల్యాణ్‌ ప్రకటించడంతో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని