Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు.

Published : 25 Jun 2024 14:45 IST

విజయవాడ: జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేశారు. 

మరోవైపు డిప్యూటీ సీఎం నేటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని