Politics: ఈ ప్రభుత్వం కూలిపోతుంది..

మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌  నేతృత్వంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం ....

Published : 23 Jun 2021 01:27 IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌  నేతృత్వంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఏదో ఒకరోజు కూలిపోతుందన్నారు. అప్పటివరకు తాము బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూలిపోతే తామే ప్రత్యామ్నాయంగా ఉంటామన్నారు. 2024 ఎన్నికల్లో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తంచేశారు. రైతులు, మరాఠా రిజర్వేషన్లు తదితర సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం చర్చించకుండా నిద్రపోతున్నట్టు కనబడుతోందని మండిపడ్డారు. అందువల్లే ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశం నుంచి తాము వాకౌట్‌ చేసినట్టు చెప్పారు. కరోనా పరిస్థితులను ఉటంకిస్తూ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను విస్మరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  ఇప్పుడు కూడా వర్షాకాల సమావేశాలను రెండు రోజులే నిర్వహించాలని ప్రతిపాదించడం ఏమిటని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ‘మహావికాస్‌ అఘాడీ( ఎంవీఏ) ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనేక ఊహగానాలు వస్తున్న వేళ ఫడణవీస్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని