Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో చేరింది నేను కాదు.. మా అబ్బాయి: డీఎస్‌

తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను డీఎస్‌ ఖండించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ  పంపించారు.

Updated : 27 Mar 2023 18:15 IST

హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) (Dharmapuri Srinivas) ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Kharge) లేఖ రాశారు. ‘‘ నిన్న నా కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌తోపాటు నేను కూడా గాంధీ భవన్‌కు వెళ్లాను. నాకు కూడా కండువా కప్పి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారు. ఒకవేళ నేను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే రాజీనామా చేస్తాను’’ అని డీఎస్‌ పేర్కొన్నారు. వయసురీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. 

తన లేఖలో భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు. డీఎస్‌ గతంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని భార్య విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. ‘‘ రాజకీయాల కోసం డీఎస్‌ను వాడుకోవద్దు. డీఎస్‌కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చింది. కాంగ్రెస్‌ వారికి చేతలు జోడించి దండం పెడుతున్నా. కాంగ్రెస్‌ వారు ఇటువైపు రావొద్దు. డీఎస్‌ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి.’’ అని విజయలక్ష్మి అన్నారు. డీఎస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాస (అప్పట్లో తెరాస)లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని