Dhulipalla Narendra: ఆ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవాల్సిందే: ధూళిపాళ్ల
ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఫోటోకి దండం పెట్టుకుంటోందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేసారు.
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ సీఎం జగన్ ఫొటోకి దండం పెడుతోందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. ఏపీలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్ బినామీలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని ధ్వజమెత్తారు. ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవాల్సిందేనని మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులు, వైకాపా నేతల వసూళ్లు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్న ఆయన.. రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్‌ఫ్లోకు బదులుగా రివర్స్‌ఫ్లో జరుగుతుండటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
‘‘ఎఫ్‌డీఐల ఆకర్షణలో 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటు. ఉన్న పరిశ్రమలను బెదిరించి తమ వారికి కట్టబెట్టుకుంటున్నారు. కాకినాడ సెజ్, గంగవరం పోర్టు వంటివే ఇందుకు ఉదాహరణలు. ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకునే వాళ్లని బెదిరించటం లేదా వారి వ్యాపారాన్ని లాక్కోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. టెక్స్‌టైల్స్, ఆహార ఇతర రంగాలకు ఇవ్వాల్సిన రూ. 6వేల కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలి’’ అని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్