శిందే జీ.. గడ్చిరోలిలో దీపావళి చేసుకున్నారు అందుకేనా?: ఎన్సీపీ

‘‘గడ్చిరోలిలో పోలీసులతో కలిసి సీఎం ఏక్‌నాథ్‌ శిందే దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ఆనందమే. కానీ అక్కడే ఎందుకు?’’ అని ఎన్సీపీ ప్రశ్నించింది. 

Published : 26 Oct 2022 18:01 IST

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Sindhe) నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో దీపావళి వేడుకలు చేసుకోవడంపై ఎన్సీపీ(NCP) స్పందించింది. పబ్లిసిటీ కోసమే ఆయన గడ్చిరోలిలో పోలీసులతో కలిసి వేడుకలు చేసుకున్నారని విమర్శించింది. మంగళవారం శిందే భామ్రాగఢ్‌ పర్యటనలో భాగంగా అక్కడి పోలీసులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్‌ క్రాస్టో ట్వీట్‌ చేశారు. ‘‘గడ్చిరోలిలో పోలీసులతో కలిసి సీఎం ఏక్‌నాథ్‌ శిందే దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ఆనందమే. కానీ అక్కడే ఎందుకు? అనేదే మా ప్రశ్న. నక్సల్‌ ప్రభావిత ప్రాంతం గనక అక్కడైతే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందనా? మహారాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. సీఎం నిజంగా వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలని భావించి ఉంటే  రాష్ట్రవ్యాప్తంగా వారితో కలిసి దీపావళి వేడుకలు చేసుకొని ఉండాల్సింది. ఏదేమైనా సీఎం తన విధుల్లో అత్యధికభాగం వేడుకలకు హాజరుకావడం ద్వారా గడిపేస్తున్నారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని