Nusrat Jahan: ఆమె వ్యక్తిగతం ఎవరికీ వద్దు..కానీ,

పార్లమెంట్ సాక్షిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్‌ నటి నుస్రత్ జహాన్ అబద్ధం చెప్పారా? అని భాజపా ఎంపీ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

Updated : 11 Jun 2021 06:20 IST

కోల్‌కతా: పార్లమెంట్ సాక్షిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్‌ నటి నుస్రత్ జహాన్ అబద్ధం చెప్పారా? అని భాజపా ఎంపీ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. తాను భర్తతో విడిపోయానని, తన వివాహబంధం భారత్‌లో చట్టబద్ధం కాదంటూ నిన్న ఆమె చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. దీనిపై మాలవీయ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ జైన్ వ్యక్తిగత జీవితం, ఆమె వివాహం చేసుకున్నారా..? లేదా..? అనే అ విషయాలు ఎవరికి అవసరం లేదు. కానీ ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. అలాగే ఆమె నిఖిల్‌ జైన్‌ను వివాహం చేసుకున్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఆమె పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారా?’ అని మాలవీయ ట్వీట్ చేశారు.

నిఖిల్ జైన్‌, నుస్రత్ జహాన్ 2019లో టర్కీలో డెస్టినేషన్ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే వారిద్దరు విడిపోయారనే వార్తలపై నుస్రత్ నిన్న ఓ ప్రకటన చేశారు. ‘ఇది రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన వివాహం. దానికి భారత్‌లోని ప్రత్యేక వివాహ చట్టం కింద ధ్రువీకరణ అవసరం. కానీ అది జరగలేదు. చట్టం ప్రకారం ఈ వివాహం జరిగినట్టు కాదు. ఇది సహజీవనం కిందికి వస్తుంది’ అని వెల్లడించింది. అలాగే తనకు తెలియకుండా తన డబ్బు, నగలు, ఆస్తుల్ని దుర్వినియోగం చేశారంటూ నిఖిల్‌పై ఆరోపణలు చేశారు. మరోవైపు, వివాహ రద్దు కోసం తాను కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు నిఖిల్ జైన్ వెల్లడించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నుస్రత్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు. అలాగే తాము 2020 నవంబర్ నుంచి విడిగా ఉంటున్నట్లు చెప్పారు. మరోపక్క, తన సోషల్ మీడియా ఖాతాల్లో నిఖిల్‌కు సంబంధించిన ఫొటోలను నుస్రత్ తొలగించారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని