నేను ఆ కుర్చీలో కూర్చోలేదు: అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి మధ్య లోక్‌సభలో మంగళవారం స్వల్ప మాటల యుద్ధం కొనసాగింది. షా బెంగాల్‌ పర్యటనకు వచ్చినప్పుడు ........

Updated : 10 Feb 2021 04:30 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి మధ్య లోక్‌సభలో మంగళవారం స్వల్ప మాటల యుద్ధం కొనసాగింది. షా బెంగాల్‌ పర్యటనకు వచ్చినప్పుడు శాంతినికేతన్‌లో విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుర్చీలో కూర్చొని ఆయన్ను అగౌరవ పరిచారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. దీనిపై దీటుగా స్పందించిన అమిత్‌ షా.. తాను ఠాగూర్‌ కుర్చీలో కూర్చోలేదని స్పష్టంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గత నెలలో బెంగాల్‌ పర్యటనకు వెళ్లినపుడు శాంతినికేతన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘అమిత్‌ షా శాంతినికేతన్‌ సందర్శించినప్పుడు విశ్వకవి ఠాగూర్‌ కుర్చీలో కూర్చొని ఆయన్ను అగౌరవపరిచారు’ అంటూ అధిర్‌ రంజన్‌ చేసిన ఆరోపణల్ని అమిత్‌షా తోసిపుచ్చారు. ‘నేను శాంతినికేతన్‌ సందర్శించినపుడు ఠాగూర్‌ కుర్చీలో కూర్చోలేదు. నేను కేవలం కిటికీ దగ్గర మాత్రమే కూర్చున్నా. అక్కడ ఎవరైనా కూర్చోడానికి అనుమతి ఉంది. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ సైతం శాంతినికేతన్‌ సందర్శించినపుడు అక్కడే కూర్చున్నారు. నేను అక్కడ కూర్చోలేదని నిర్దారిస్తూ విశ్వభారతి వర్శిటీ ఉపకులపతి ఇచ్చిన లేఖ కూడా ఉంది’ అని షా లోక్‌సభలో స్పష్టం చేశారు. కాగా అధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన ఆరోపణల్ని తప్పుడు సమాచారంగా పేర్కొంటూ విశ్వభారతి వర్శిటీ ఉపకులపతి విద్యుత్‌ చక్రవర్తి లేఖ విడుదల చేశారు.

ఇదీ చదవండి

ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కన్నీరు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని