Updated : 06 Jul 2021 04:47 IST

digvijay: భాజపాకు అదే బోధిస్తారా?

దిల్లీ: హిందూ-ముస్లింల ఐక్యత అంశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. ఆ అంశంలో భాజపా నేతలకు కూడా తన అభిప్రాయాన్నే బోధిస్తారా? అంటూ మోహన్‌ భగవత్‌ను దిగ్విజయ్ ప్రశ్నించారు. హిందూ ముస్లింలది ఒకే డీఎన్‌ఏ అని.. వారి మధ్య ఎలాంటి భేదమూ లేదని ఓ సమావేశంలో ఇరు మతస్థుల ఐకమత్యంపై ఆదివారం మోహన్‌ భగవత్‌ తన అభిప్రాయం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందిస్తూ సోమవారం ట్వీట్‌ చేశారు.

‘‘హిందూ ముస్లింల ఐక్యతపై మీకున్న అభిప్రాయాన్నే.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా భాజపాకు చెందిన ముఖ్యమంత్రులకు, విశ్వ హిందూ పరిషత్తు, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకు సైతం బోధిస్తారా?’’ అంటూ ప్రశ్నించారు. తాను వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజాయతీ ఉంటే అమాయకులైన ముస్లిం ప్రజలపై వేధింపులకు పాల్పడిన భాజపా నాయకులను ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బహిష్కరించాలని మోహన్‌ భగవత్‌ను కోరుతూ దిగ్విజయ్‌ మరో ట్వీట్‌ చేశారు. అందులో నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని