Telangana News: గాంధీభవన్‌లో గందరగోళం.. సీనియర్ నేతలపై దిగ్విజయ్ అసహనం
‘పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా?. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి కానీ, మీడియా ఎదుట బహిర్గతం చేస్తే ఎలా?’ అని ఏఐసీసీ దూత దిగ్విజయ్ సింగ్ సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాయకులపై ఓయూ విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ ఇటీవల పీసీసీని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం గాంధీభవన్ నుంచి అనిల్ బయటకు వస్తున్న క్రమంలో ఆయనపై ఓయు విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అయినా, కమిటీల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏఐసీసీ దూతగా సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సీనియర్ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని దిగ్విజయ్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. ‘‘పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయితీ మంచిది కాదు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి.. మీడియా ముందు మాట్లాడటం సరికాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే .. హై కమాండ్ చూస్తూ ఊరుకోదు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.. మీరు ఏం చేశారు? అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం .. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి?’’ అని దిగ్విజయ్ సింగ్ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం.
దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఏ కాంగ్రెస్ నాయకుడు ఎప్పటి నుంచి ఉన్నారు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారని అన్ని విషయాలు వారికి తెలుసు. వారితో సమకాలీన రాజకీయ, ఆర్థికపరమైన అంశాలు, సామాజిక అంశాలు వారితో చర్చించాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే
-
Crime News
Kamareddy: ఆపరేషన్ థియేటర్లో అగ్ని ప్రమాదం
-
Sports News
Mohit Sharma: ఆ రాత్రి నిద్రపట్టలేదు.. నా ప్లాన్ అదే కానీ మిస్‌ఫైర్ అయింది: మోహిత్
-
World News
Kim Jong Un: కిమ్ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!
-
Movies News
Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్
-
India News
Fire Accident: కన్నూరులో నిలిచి ఉన్న ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు