Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు

చంద్రబాబు విడుదలయ్యేంత వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Updated : 23 Sep 2023 15:39 IST

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) అక్రమమని ప్రజలకు తెలియజెప్పేందుకే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుసగా రెండో రోజు ఆయన దీక్ష కొనసాగించారు. చంద్రబాబు విడుదలయ్యేంత వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి.. ఉద్యోగాలు వచ్చేలా చంద్రబాబు కృషి చేశారని, అలాంటి వ్యక్తిని దురుద్దేశ పూర్వకంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై నమ్మకం ఉన్న అధికారులెవ్వరూ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి సహకరించవద్దని శ్రీనివాసులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు