మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా దిలిప్‌ వాల్షే 

మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్‌ వాల్షే పాటిల్‌ నియమితులయ్యారు. ఇదివరకు  హోంమంత్రిగా ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌.....

Updated : 06 Apr 2021 10:16 IST

పవార్‌ పీఏగా మొదలై.. హోంమంత్రిగా ఎదిగి!


ముంబయి: మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్‌ వాల్షే పాటిల్‌ నియమితులయ్యారు. ఇదివరకు హోంమంత్రిగా ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న దిలీప్‌ వాల్షేకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దిలీప్‌ వాల్షే నిర్వహిస్తున్న ఎక్సైజ్‌ శాఖను డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్‌ పవార్‌కు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఎవరీ దిలిప్‌ వాల్షే..

1954 అక్టోబర్‌ 30న  అంబెగాన్‌లో జన్మించిన దిలీప్‌ వాల్షే రాజకీయ కుటుంబం నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్నేహితుడు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే దత్తాత్రేయ్‌ వాల్షే పాటిల్‌ తనయుడు. దిలీప్‌ వాల్షే శరద్‌ పవార్‌కు వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1990లో అంబేగాన్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పట్నుంచి అదే స్థానం నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్నారు. 1999లో ఎన్సీపీ ఏర్పాటైన సందర్భంలో ఆయన పవార్‌ వెంట నడిచారు. అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కేబినెట్‌లో విద్యుత్‌, వైద్యవిద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గానూ ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని