Chandrababu: భాజపా ప్రజాప్రతినిధులకు చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు

భాజపా ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

Published : 20 Jun 2024 22:59 IST

ఉండవల్లి: భాజపా ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీలు పురందేశ్వరి, సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు సీఎం నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ చంద్రబాబు.. బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. అందరితో కలిసి భోజనం చేశారు. ఎన్నికలు జరిగిన తీరు, కలిసికట్టుగా పడిన కష్టం గురించి నేతలు చర్చించారు. ఐదేళ్ల వైకాపా పాలనలో వేధింపులను సుజనాచౌదరి ప్రస్తావించారు.  వైకాపా వేధింపులకు అన్ని వర్గాలు బాధితులేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అనపర్తిలో ఉపాధి నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలపగా.. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభించేస్తావంటూ చంద్రబాబు అభినందించారు. మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భాజపా కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు సీఎంకు వినతి పత్రాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని