తెరాసపై అన్నివర్గాల్లో అసంతృప్తి: కోదండరామ్‌

తెరాస ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని, దాన్ని వ్యక్తం చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ వేదికగా చూస్తున్నారని తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్‌..

Updated : 09 Mar 2021 13:35 IST

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని, దాన్ని వ్యక్తం చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ వేదికగా చూస్తున్నారని తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్‌ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని తన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిరంకుశ, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ జరిగి రేపటితో పదేళ్లు పూర్తవనుందని తెలిపారు. ఈ సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అమరవీరులకు నివాళి అర్పిస్తామన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌లో తప్పుడు ఓట్లు వేస్తే క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని