‘విభజన రాజకీయాలు వారి డీఎన్‌ఏలో ఉన్నాయి’

ప్రతిపక్షాలు విభజన రాజకీయాలతో సమాజంలో చీలికలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన డియోరా నియోజకవర్గ భాజపా కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు.

Published : 11 Oct 2020 00:57 IST

లఖ్‌నవూ: ప్రతిపక్షాలు విభజన రాజకీయాలతో సమాజంలో చీలికలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన డియోరా నియోజకవర్గ భాజపా కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘భాజపాకు ప్రజా ప్రయోజనాలు మొదటి ప్రాముఖ్యత. భాజపా హయాంలో జరిగిన అభివృద్ధిని తట్టుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కులాలు, వర్గాల వారీగా విభజన చేసేందుకు కుట్ర చేస్తున్నారు. విభజన రాజకీయాలు వారి డీఎన్‌ఏలో ఉన్నాయి. ఆ ఆలోచనా ధోరణితోనే మొదట దేశాన్ని విభజించారు. ఇప్పుడు సమాజంలో కులాలు, వర్గాల మధ్య విభజన చేయడానికి యత్నిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీలు రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు పాలించాయి. వారి పాలనలో కేవలం అవినీతి, అక్రమాలే రాజ్యమేలాయి. అభివృద్ధి కేవలం మాటల వరకే ఉంటుంది’ అని యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. నవంబర్‌ 3న యూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని