
TS News: కేసీఆర్ వైఫల్యమే పాలమూరుపై ఎన్జీటీ స్టేకు కారణం: డీకే ఆరుణ
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇవ్వడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పాలమూరుపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే స్టే వచ్చిందని విమర్శించారు. డీపీఆర్‌లు ఇవ్వకపోవడం, ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లనే స్టే వచ్చిందన్నారు. ‘‘ దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ముందు నుంచి కృష్ణానదిని పక్క రాష్ట్రానికి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. కృష్ణా పూర్తిగా దారిమళ్లిపోతే గోదావరిపై మరిన్ని లిఫ్టులు పెట్టి దోచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. పాలమూరు పనులు ఆగిపోతే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారతాయి. రీ డిజైన్ చేసి కమీషన్లు దండుకోవడం తప్ప ప్రాజెక్టులపై చిత్తశుద్ధిలేదు. కేసీఆర్‌ను పాలమూరు రైతులు క్షమించరు’’ అని డీకే అరుణ విమర్శించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.