DL Ravindra Reddy: ఈసారి వైకాపాకు సింగిల్‌ డిజిట్‌ వస్తే గొప్పే!: డీఎల్‌

వైకాపాలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 21 Dec 2022 14:14 IST

కడప: పరిపాలన మొదటిరోజు నుంచే సీఎం జగన్‌ అవినీతికి పాల్పడ్డారని.. వైకాపాలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎల్‌ మాట్లాడారు.

‘‘ఈసారి వైకాపాకు సింగిల్‌ డిజిట్‌ వస్తే గొప్పే. ఏపీని తెదేపా అధినేత చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరు. జనసేన అధ్యక్షుడు పవన్‌ నిజాయతీని ప్రశ్నించలేం. రాష్ట్రం  కోసం వారిద్దరూ కలిసి పోటీచేస్తారని ఆశిస్తున్నా. నేను వైకాపాలోనే ఉన్నా.. వారేమీ నన్ను తీసేయలేదు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరఫునే నేను పోటీ చేస్తా. 

జనవరి 3 నుంచి మాజీ మంత్రి వివేకా హత్య కేసు మలుపులు తిరగనుంది. ఆ కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించింది. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఉన్నాయి. సుప్రీం తీర్పు తర్వాత ఈ కేసు విషయంలో జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశముంది. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆమె కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు’’ అని డీఎల్‌ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని