డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఓ ఉన్నతాధికారికి ఫోన్లో షాక్ ఇచ్చారు. ఔత్సాహిక ఉపాధ్యాయులు తమ డిమాండ్లపై తలపెట్టిన నిరసనకు అనుమతి...........
ఫోన్‌కాల్ వీడియో వైరల్
పట్నా: ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఓ ఉన్నతాధికారికి ఫోన్లో షాక్ ఇచ్చారు. పట్నాలో ఔత్సాహిక ఉపాధ్యాయులు తమ డిమాండ్లపై తలపెట్టిన నిరసనకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయనే స్వయంగా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఔత్సాహిక ఉపాధ్యాయులు తమ సమస్యలపై పట్నాలోని ఎకో పార్కు వద్ద ధర్నాకు దిగారు. దీంతో వారికి మద్దతు తెలిపేందుకు తేజస్వి యాదవ్ అక్కడికి వెళ్లగా.. ధర్నాకు అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. దీంతో అక్కడి నుంచే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పట్నా జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫోన్ చేసి వారి ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలోనే పట్నా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (డీఎం)తో మాట్లాడుతూ.. ధర్నాలో కూర్చొనేందుకు అనుమతివ్వడంలేదని యువకులు చెబుతున్నారు. ఎందుకు? అని తేజస్వి ప్రశ్నించారు. ప్రతిరోజూ అనుమతి తీసుకోవాలా? పోలీసులు లాఠీఛార్జి చేశారు, వారు తీసుకొచ్చిన ఆహారాన్ని విసిరేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.. అంటూ అక్కడి పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఇంకొందరు ఎకో పార్కు వద్ద తనతోనే ఉన్నారని తేజస్వి వివరించారు. వారి దరఖాస్తును తాను వాట్సాప్‌లో పంపిస్తానని, ధర్నా చేసుకోనివ్వాలని ఆయన కోరారు.
దీనికి స్పందించిన సింగ్.. దరఖాస్తు పంపిస్తే పరిశీలిస్తానంటూ సమాధానమిచ్చారు. ఎప్పుడు అనుమతిస్తారు? అని తేజస్వి అడగ్గా.. నన్ను మీరు ప్రశ్నిస్తారా? అంటూ సింగ్ గట్టిగా స్పందించారు. దీంతో ‘డీఎం సాబ్.. నేను తేజస్వి యాదవ్‌ని మాట్లాడుతున్నా..’ అని చెప్పడంతో అప్రమత్తమైన ఆ ఉన్నతాధికారి తన గొంతును సవరించుకొని ‘ఓకే.. సర్..సర్..సర్’ అనడంతో అక్కడే ఉన్న నిరసనకారులంతా ఒక్కసారిగా నవ్వారు. అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. దరఖాస్తును వాట్సాప్‌లో పంపిస్తా. త్వరగా స్పందించండి. లేకపోతే రాత్రంతా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పి తన కాల్‌ను పూర్తి చేశారు. డీఎం, తేజస్వి మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి..
సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!