EC - BRS MPs: కారును పోలిన గుర్తులను వేరేవారికి కేటాయించొద్దు: ఈసీకి భారాస ఎంపీల విజ్ఞప్తి

కేంద్ర ఎన్నికల సంఘాన్ని భారాస ఎంపీల బృందం కలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేసింది.

Updated : 27 Sep 2023 12:47 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘాన్ని భారాస ఎంపీల బృందం కలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేసింది. గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు ఎంపీలు వివరించారు. ఈ విషయాన్ని గతంలోనూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. 

రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5,000mAh బ్యాట

ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో... కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునః సమీక్ష చేయాలని భారాస ఎంపీలు కోరారు. ఈసీని కలిసిన వారిలో పార్టీ ఎంపీలు వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని