Madhu Yaskhi: నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ

నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే...

Published : 07 Jul 2024 04:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. శనివారం తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘తెలంగాణ ఉద్యమం పేరిట ఆనాడు యువతను రెచ్చగొట్టి వారి బలిదానాలకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లు కారణమయ్యారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్‌... తర్వాత మాట మార్చారు. ఉద్యోగాల ఖాళీల గుర్తింపు కోసం నియమించిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ సుమారు 3లక్షల ఖాళీలున్నాయని ఇచ్చిన నివేదికను పక్కనపెట్టారు. ఇప్పుడు నిరుద్యోగులతోనే దీక్షలు, ఆందోళనలు చేయిస్తూ కుట్రలకు పూనుకున్నారు. యవత మరోసారి భారాస ఉచ్చులో పడొద్దు’’ అని సూచించారు. 

సీఎంల భేటీపై బురద చల్లుతున్న భారాస: తీన్మార్‌ మల్లన్న 

తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై భారాస నేతలు బురద చల్లుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు.  విభజన హామీలు పరిష్కారమయ్యేలా  సీఎంలు నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని