- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
UP Polls 2022: డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే డబుల్ కరప్షన్: అఖిలేశ్
బిజ్నోర్: యూపీలో ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనీ.. రాష్ట్రంలో భాజపాను గెలిపించాలంటూ ఓటర్లకు చేస్తున్న విజ్ఞప్తిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. యూపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ కరెప్షన్కి దారితీసిందంటూ ధ్వజమెత్తారు. బిజ్నోర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ సింగ్ చౌధురితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణాన్ని ప్రస్తావించిన అఖిలేశ్.. ‘నూతన లోక్‌సభ భవనంలోకి ఏ రాజ్యాంగాన్ని తీసుకొస్తారో ఎవరికి తెలుసు? యూపీ ఎన్నికల్లో భాజపాను నిలువరించడం అత్యావశ్యకం. ఎందుకంటే దీని తర్వాత అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు సైతం భాజపా ఏమైనా చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
చిన్న నేతలు చిన్న చిన్న అబద్ధాలు.. పెద్ద నేతలు పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతున్నారంటూ భాజపాపై విరుచుకుపడ్డారు. అవినీతిని అంతం చేయడానికే పెద్ద నోట్లు రద్దుచేస్తున్నామనీ చెప్పారనీ.. కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే డబుల్ డబుల్ కరెప్షన్గా పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఒకరి చక్రాలను మరొకరు తొలగించుకొనే పనిలో బిజీగా ఉన్నారంటూ అఖిలేశ్ ఎద్దేవా చేశారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ కూటమికి ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు వస్తోందనీ.. మార్చి 10న ఏర్పడేది తమ ప్రభుత్వమేనన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
General News
అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
-
India News
CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
-
Politics News
Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Thiru review: రివ్యూ: తిరు
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం