దుబ్బాక: 10వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు, 8, 9 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. 6, 7, 10  రౌండ్లలో లో తెరాసకు ఆధిక్యం లభించింది...

Updated : 10 Nov 2020 13:15 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు, 8, 9 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. 6, 7, 10  రౌండ్లలో లో తెరాసకు ఆధిక్యం లభించింది. పదో రౌండ్‌లో తెరాసకు 456 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం పది రౌండ్లు పూర్తయ్యే సరికి భాజపా ఆధిక్యం 3,734 ఓట్లు. 10వ రౌండ్‌ ముగిసే సరికి భాజపాకు 31,783, తెరాసకు 28,049, కాంగ్రెస్‌కు 6,699 ఓట్లు లభించాయి. 

రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు..
మొదటి రౌండ్‌లో 7,446 ఓట్లు లెక్కించగా.. తెరాస 2867, భాజపా 3208, కాంగ్రెస్‌ 648 ఓట్లు సాధించాయి. భాజపా ఆధిక్యం 341 ఓట్లు. 

రెండో రౌండ్‌లో: 7,127 ఓట్లు లెక్కించగా.. 794 ఓట్లతో రఘునందన్‌రావు ఆధిక్యం ప్రదర్శించారు. భాజపాకు 3,284 ఓట్లు రాగా, తెరాసకు 2,490, కాంగ్రెస్‌కు 667 ఓట్లు పోలయ్యాయి. 

మూడో రౌండ్‌లో: 6,601 ఓట్లు లెక్కించగా... భాజపా 2,731, తెరాసకు 2,607, కాంగ్రెస్‌కు 616 ఓట్లు పోలయ్యాయి. భాజపా ఆధిక్యం 124 ఓట్లు.

నాలుగో రౌండ్‌:  భాజపాకు 3,832, తెరాస 2,407, కాంగ్రెస్‌కు 227 ఓట్లు పోలయ్యాయి.

ఐదో రౌండ్‌: భాజపా 3,462, తెరాస 3,126, కాంగ్రెస్‌కు 566 ఓట్లు పోలయ్యాయి.

ఆరో రౌండ్‌లో: తెరాస 4,062, భాజపా 3,709, కాంగ్రెస్‌ 530 ఓట్లు పోలయ్యాయి. తెరాస ఆధిక్యం 353 ఓట్లు.

ఏడో రౌండ్‌లో : మిర్‌దొడ్డి మండలంలో ఓట్లు లెక్కించగా..తెరాసకు 2,718, భాజపాకు 2,536, కాంగ్రెస్‌కు 749 ఓట్లు పోలయ్యాయి. తెరాసకు 182 ఓట్ల ఆధిక్యం.

ఎనిమిదో రౌండ్‌లో: భాజపా 3,116, తెరాస 2,495, కాంగ్రెస్‌కు 1,122 ఓట్లు లభించాయి.

తొమ్మిదో రౌండ్‌లో : భాజపాకు 29,291 ఓట్లు, తెరాసకు 25,101 ఓట్లు, కాంగ్రెస్‌కు 5,800 ఓట్లు పోలయ్యాయి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని