దుబ్బాకలో 55.52 శాతం పోలింగ్‌

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 03 Nov 2020 15:22 IST

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ భారతి హొళికెరితోపాటు పలువురు అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిపై ఆరా తీస్తున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు పోలింగ్‌ సరళిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని